40 లక్షలు ఇవ్వకుంటే పరువు తీస్తానంటూ యువరాజ్ కుటుంబానికి మహిళ బెదిరింపులు

  • గతంలో యువీ కుటుంబంలో పని చేసిన ఓ మహిళ
  • పని తీరు బాగా లేకపోవడంతో 20 రోజుల్లోనే తొలగించిన యువీ తల్లి
  • వాట్సప్‌లో యువీ తల్లికి బెదిరింపు మెసేజ్‌లు చేసిన మహిళ
నలభై లక్షల రూపాయలు ఇవ్వకుంటే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానంటూ భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబాన్ని ఓ మహిళ బెదిరించింది. ఈ కేసులో గతంలో యువీ కుటుంబం వద్ద పని చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే యువరాజ్ సింగ్ సోదరుడు జోరవీర్‌‌ సింగ్ కొన్నేళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనకు సహాయకురాలిగా పని చేసేందుకు యువీ తల్లి షబ్నం గతేడాది హేమా కౌశిక్ అనే మహిళను నియమించింది. 

కానీ, హేమ తీరు బాగా లేకపోవడంతో 20 రోజుల్లోనే పనిలో నుంచి తొలగించింది. ఈ ఏడాది మే నుంచి యువీ తల్లికి హేమ వాట్సప్‌లో మెసేజ్ లు చేస్తూ బెదిరిస్తోంది. రూ. 40 లక్షలు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెట్టి కుటుంబం పరువు తీస్తానంటూ యువీ తల్లిని బెదిరిస్తోంది. దీనిపై యువరాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గురుగ్రామ్‌ పోలీసులు ఆమెను ఆరెస్ట్‌ చేశారు.


More Telugu News