పునర్జన్మల నేపథ్యంలో సాగే కథనే 'కంగువ'
- సూర్య హీరోగా రూపొందుతున్న 'కంగువ'
- 300 కోట్ల బడ్జెట్ తో సెట్స్ పైకి వెళ్లిన ప్రాజెక్టు
- డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న సూర్య
- 10 భాషల్లో విడుదల కానున్న సినిమా
ఈ మధ్య కాలంలో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్' తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా చూసిన సూర్య అభిమానులు, తమ హీరో కూడా అందులో ఉంటే బాగుండునని అనుకున్నారు. వాళ్ల ముచ్చట తీర్చడం కోసం అన్నట్టుగా 'కంగువ'లో సూర్య యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు. రీసెంటుగా వదిలిన గ్లింప్స్ చూసి, ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఇది యాక్షన్ మూవీ అనే విషయం పోస్టర్ల దగ్గర నుంచే అందరికీ అర్థమైపోతోంది. అయితే ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ వెనుక, పునర్జన్మల నేపథ్యం ఉందని చెబుతున్నారు. అంటే ఈ కథ గతంలోనూ .. వర్తమానంలోను కొనసాగుతుందన్న మాట. అందువలన సూర్య పాత్రలో వేరియేషన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని చెబుతున్నారు.
ఇక ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఈ స్థాయి బడ్జెట్ లో సూర్య సినిమా నిర్మితమవుతూ ఉండటం ఇదే ఫస్టు టైమ్. స్టూడియో గ్రీన్ - యూవీ క్రియేషన్స్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 10 భాషల్లో .. 3D వెర్షన్ లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.