నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఒడిశాలో 30వ తేదీ వరకు భారీ వర్షాలు

  • నిన్న తీవ్ర పీడనంగా మారిన అల్పపీడనం
  •  7.6 కిలోమీటర్ల ఎత్తున మరో తుపాను ఆవర్తనం
  • తీరప్రాంతంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారగా మరికాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది. 

దీని ప్రభావంతో ఈ నెల 30వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అలాగే, తీర ప్రాంతంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.


More Telugu News