దైవాంశ సంభూతుడు మా పవన్ కల్యాణ్: 'బ్రో' ఈవెంటులో బ్రహ్మానందం

  • హైదరాబాదులో జరిగిన 'బ్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • పవన్ కి విజయాన్ని అందించమన్న బ్రహ్మానందం 
  • ఆయన వ్యక్తిత్వం స్వచ్ఛమైనదని కితాబు 
  • ఈ సినిమా సూపర్ హిట్ కావాలంటూ ఆకాంక్ష
పవన్ కల్యాణ్ - సాయితేజ్ కాంబినేషన్లో రూపొందిన 'బ్రో' సినిమా, ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో బ్రహ్మానందం మాట్లాడుతూ .. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే స్థాయి ఉన్న అతికొద్ది మందిలో నేను ఒకడినని నమ్ముతున్నాను. ఆయనకి 18 - 20 ఏళ్లు ఉన్నప్పటి నుంచి నేను చూస్తూ వస్తున్నాను" అని అన్నారు. 
 
ఈ సినిమాలో నేను ఒక చిన్న పాత్రను చేశాను. పవన్ తో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కల్యాణ్ నవ్వితే పత్తికాయ విచ్చుకున్నట్టుగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆయన నవ్వు .. మనసు కూడా అంతే తెల్లగా ఉంటాయి. ఆయనలో ఏ వైపు నుంచి చూసినా మంచితనమే కనిపిస్తుంది .. ఆయన ఒక దైవాంశ సంభూతుడు" అని చెప్పారు. 

పవన్ కల్యాణ్ విజయానికి అన్ని విధాలుగా తోడ్పడాలని అభిమానులను కోరుతున్నాను. ఈ నాలుగు మాటలు చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నేను కోరుకోకపోయినా అవుతుందని నాకు తెలుసు. ఈ వేదిక ద్వారా మరో సారి టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను" అన్నారు. 



More Telugu News