ధోని అపాయింట్‌మెంట్ లెటర్ ఇదిగో... వేతనం రూ.43 వేలు, అలవెన్స్‌లు రూ.81 వేలు!

  • 11 ఏళ్ల క్రితం జాబ్ అపాయింటుమెంట్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్
  • అందులో ఇండియా సిమెంట్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ధోని నియామకం
  • ఫిక్స్డ్ అలవెన్స్ రూ.21,790, స్పెషల్ అలవెన్స్‌గా రూ.60,000
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ చరిత్రను లిఖించుకున్నారు. మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలిగినప్పటికీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అతని నికర ఆస్తుల విలువ రూ.1,040 కోట్లుగా ఉంది. ఇండియన్ క్రికెట్ సెన్సేషన్ విరాట్ కోహ్లీ రూ.1,050 కోట్ల ఆస్తుల కంటే చాలా కొద్దిగా మాత్రమే వెనుక ఉన్నారు. 

అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగినంత కాలం అధిక వేతనం అందుకున్న వారిలో ధోనీ ఎప్పుడూ మొదట నిలిచారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న క్రికెటర్ గా ఉన్నారు. అంతేకాదు, వివిధ వ్యాపార ప్రకటనలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కోట్లు ఆర్జిస్తున్నారు.

అయితే తాజాగా ధోని మరోసారి పతాకశీర్షికల్లో నిలిచారు. అతని పదకొండేళ్ల క్రితం జాబ్ అపాయింటుమెంట్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఇండియా సిమెంట్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ధోని నియ‌మితుడ‌య్యారు. 

ఇందుకుగానూ నెల‌కు రూ.43,000 వేతనం ఇస్తున్న‌ట్టు ఆ లెట‌ర్‌లో ఉంది. ఫిక్స్‌డ్ అలవెన్స్‌లు నెల‌కు రూ.21,790, స్పెష‌ల్ అల‌వెన్సు నెల‌కు రూ.60,000 ఉన్నాయి. ఈ అపాయింటుమెంట్ లెటర్ ఫోటోను చూసిన అభిమానులు కొంద‌రు వేతనం కంటే స్పెష‌ల్ అల‌వెన్స్ ఎక్కువ ఉందంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.


More Telugu News