రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ... వివరాలు ఇవిగో!
- ఇటీవల మీషో యాడ్ లో నటించిన రామ్ చరణ్
- తాజాగా తన్మయ్ భట్ కు ఇంటర్వ్యూ
- ఫ్యాషన్ పై అభిప్రాయాలు పంచుకున్న గ్లోబల్ స్టార్
- ఆస్కార్ వేళ ఏంచేశారన్న ప్రశ్నకూ జవాబిచ్చిన వైనం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా మీషో సంస్థ కోసం ఓ ఆసక్తికరమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. రామ్ చరణ్ ఇటీవల ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ మీషో యాడ్ లోనూ నటించారు. తాజాగా, నటుడు, యూట్యూబర్, స్క్రిప్ట్ రైటర్, ప్రొడ్యూసర్, ఓ మార్కెటింగ్ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు తన్మయ్ భట్ నిర్వహించిన చిట్ చాట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూ హైలైట్స్...
తన్మయ్ భట్: హాయ్ రామ్ చరణ్ సర్.
రామ్ చరణ్: నన్ను రామ్ అని పిలిస్తే సరిపోతుంది. ఈ కార్యక్రమానికి రావడం నాకు టెన్షన్ కలిగించింది. ముఖ్యంగా, మీతో ఇంటర్వ్యూ అనగానే ఆ టెన్షన్ ఇంకాస్త పెరిగింది.
ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటానని అనుకోలేదు. నిజంగా ఇది ఒక సర్ ప్రైజ్ లాంటిదే.
తన్మయ్ భట్: నిజమే సర్... మనం ఇక్కడ మీషో కోసం కలుసుకున్నాం. ముఖ్యంగా ఇవాళ మనం షాపింగ్ గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇటీవల ఆస్కార్ అవార్డుల కార్యక్రమంతో మొదలుపెడదాం. ఆస్కార్ అవార్డుల రోజు రాత్రి మీరు ఏంచేశారు?
రామ్ చరణ్: మా దర్శకుడు రాజమౌళి గారు షూటింగ్ లో ఎలా ఉంటారో ఆస్కార్ సమయంలోనూ అలాగే ఉన్నారు. ఉదయం 7 గంటలకల్లా రెడీ అవ్వాలని చెప్పేవారు. మనం ఉన్నది హాలీవుడ్ లో... ఇక్కడ ఉండేది మీ సౌతిండియా మీడియానో లేక ముంబయి మీడియానో అనుకోవద్దు. తేడా వస్తే ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు అని క్లాస్ తీసుకున్నారు. మేం హాలీవుడ్ లో అండర్ డాగ్స్ గానే అడుగుపెట్టాం. హాలీవుడ్ లో ఒక్కసారి లేట్ గా వచ్చినా, ఇతడు అప్పుడే రిచర్డ్ గెరే అయిపోయాడనో, జార్జి క్లూనీ అనుకుంటున్నాడనో అంటూ వ్యాఖ్యలు వినిపిస్తాయి... నేను అలాంటివి వినడానికి ఇక్కడికి రాలేదు... అందుకే రామ్ నువ్వు హాయిగా నిద్రపోయి, ఉదయాన్నే నిద్రలేచి ఫ్రెష్ అప్ అవ్వాలి అని రాజమౌళి సూచించారు. ఆస్కార్ రోజున రాత్రి రెస్టారెంట్ కెళ్లాం, డిన్నర్ చేశాం.
తన్మయ్ భట్: సినిమాల్లో మీ తొలి సంపాదనతో ఏం కొన్నారు?
రామ్ చరణ్: నాకు వాచీలంటే చాలా ఇష్టం. అందుకే తొలి సంపాదనతో ఒక వాచీ కొన్నాను. పటేక్ వాచీ అంటే నాకు అత్యంత ఇష్టం. కాసియో వాచీలంటే కూడా నాకు బాగా నచ్చుతాయి. కరోనా సమయంలో కాసియో వాచీ అందుకున్నప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.
తన్మయ్ భట్: మీరు ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తారా?
రామ్ చరణ్: షూటింగ్ లేకపోతే నాకంటే బద్దకస్తుడు ఇంకెవరూ ఉండరు. దాంతో బయటికి వెళ్లకుండా ఆన్ లైన్ లోనే ఎక్కువగా షాపింగ్ చేస్తాను. ఆన్ లైన్ లో ఏదైనా వస్తువు కొనాలనుకుంటే తక్కువ ధర నుంచి మొదలుపెట్టి షాపింగ్ చేస్తాను. ధరను లో టు హై సెట్ చేస్తాను. ఏదైనా వస్తువు నేను కోరుకున్న విధంగా లేకపోతే దానికోసం ఆన్ లైన్ లో అనేక పేజీలు ఓపిగ్గా వెతుకుతాను.
తన్మయ్ భట్: ఫ్యాషన్ పై మీ అభిప్రాయాలు ఏంటి?
రామ్ చరణ్: చక్కగా డ్రెస్సింగ్ అవడం నాకు చాలా ఇష్టమైన అంశం. షార్ప్ గా కనిపించేందుకు ఇష్టపడతాను. ఎప్పుడైనా పెళ్లిళ్లకు వెళ్లాలనుకుంటే చక్స్ ఉన్న షర్ట్ ధరించి వెళ్లేవాడ్ని. కానీ మా సిస్టర్ నచ్చేది కాదు. దాంతో, ఇంకేం వేసుకుని వెళ్లాలి నేను? అనే వాడ్ని. ఇప్పుడెవరైనా ఎక్కడికైనా పిలిస్తే, వాళ్లకు ఇబ్బంది కలగకుండా, తగిన విధంగా డ్రెస్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను.
తన్మయ్ భట్: అమ్మాయిలు చెప్పేంతవరకు అబ్బాయిలకు సరిగా డ్రెస్ చేసుకోవడం తెలియదంటారు. మరి మీ విషయంలో మీకు డ్రెస్సింగ్ సలహాలు ఇచ్చేది మీ భార్యనా, లేక మీ సిస్టరా?
రామ్ చరణ్: ఇప్పుడంటే నాకు పెళ్లయింది కానీ, ఇంతకుముందు నేను మా ఇంట్లో అమ్మాయిల మధ్యే పెరిగాను. అందరూ కలిపి ఆరుగురు అక్కచెల్లెళ్లు ఉండేవారు. వాళ్లు ఒకట్రెండు సార్లు నా డ్రెస్సింగ్ ను మెచ్చుకున్నట్టు గుర్తు... ఆ తర్వాత వాళ్లు నా డ్రెస్సింగ్ ను ఛీ కొట్టేశారు. వాళ్లే నా ఫ్యాషన్ నిర్ణేతలు.
తన్మయ్ భట్: మీరు ఎలా డ్రెస్ చేసుకుంటే మీ భార్య ఇష్టపడుతుందని భావిస్తున్నారు?
రామ్ చరణ్: పెళ్లయిన కొత్తలో నేను వేసుకునే దుస్తుల రంగులన్నీ గ్రే, వైట్, బ్లాక్ లో ఉండేవి. అయితే ఉపాసన దాని గురించి ఏమీ కామెంట్ చేసేది కాదు. వాటిపై వ్యాఖ్యలు చేయడం అనవసరం అనుకునేదో ఏమో కానీ, కాస్త కలర్ ఫుల్ గా ఉండే దుస్తులు వేసుకోమని మాత్రం సలహా ఇచ్చేది. డిజైనింగ్ రంగంలో ఉన్న చాలామంది ఉపాసనకు ఫ్రెండ్స్. రామ్ చరణ్ డ్రెస్సింగ్ ను మార్చు, అతడి స్టయిల్ ను ఇంకాస్త పెంచు అని సలహాలు ఇచ్చేవారనుకుంటా.
తన్మయ్ భట్: మీరు ఇతరులకు తరచుగా గిఫ్టులు ఇస్తుంటారా?
రామ్ చరణ్: చాలా మందికి గిఫ్టులు ఇస్తుంటాను... అది నా హాబీ కూడా. అయితే, ఎదుటి వ్యక్తికి ఏ కానుక అయితే బాగుంటుందో బాగా ఆలోచించి గిఫ్ట్ ఇస్తాను.
తన్మయ్ భట్: అమ్మాయిలకు ఎలాంటి గిఫ్టులు ఇవ్వాలో అబ్బాయిలకు తెలియదంటారు... దీనిపై మీరేమంటారు?
రామ్ చరణ్: నూటికి నూరు శాతం నిజం. నా భార్యకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో నాకు తెలియదు. పెళ్లయిన కొత్తలోనే ముఖాన ఈడ్చికొట్టినట్టుగా ఓ అనుభవం ఎదురైంది. అప్పట్లో ఆమె కోసం చాలా ఖరీదైన గిఫ్ట్ కొన్నాను. దాన్ని తిరస్కరించడానికి ఆమెకు ఐదు సెకన్ల సమయం కూడా పట్టలేదు. ఆ గిఫ్ట్ కొనడానికి నేను ఎన్ని స్టోర్లు తిరిగానో నాకు తెలుసు.
తన్మయ్ భట్: అమ్మాయిలకు ఎలాంటి గిఫ్టులు ఇవ్వాలని మీరు అబ్బాయిలకు సలహా ఇస్తారు?
రామ్ చరణ్: అమ్మాయిలను అడిగి, వాళ్లకు ఏం కావాలో కనుక్కోమని సలహా ఇస్తాను. అమ్మాయిలను సర్ ప్రైజ్ చేయడం అవసరం లేదనుకుంటా.