భారీ వర్షం నేపథ్యంలో... ఐటీ ఉద్యోగుల లాగ్-ఔట్‌పై సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు.. ఏ ప్రాంతంలో ఎప్పుడంటే..!

  • మూడు దశల్లో ఐటీ ఉద్యోగులు లాగ్-ఔట్ కావాలి
  • ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు సాయంత్రం మూడు గంటలకు..
  • ఐకియా నుండి బయోడైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే కార్యాలయాలు సాయంత్రం గం.4.30కు..
  • ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఉద్యోగులు సాయంత్రం మూడు గంటలకు
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లోను ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీలలో పని చేసే ఉద్యోగులకు మూడు దశల్లో లాగ్-ఔట్ చేసుకోవాలని సూచించారు. రానున్న ఐదు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో, అదే సమయంలో సోమవారం జరిగిన ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని ఐటీ కంపెనీలు దశలవారీగా లాగ్-ఔట్ కావాలని సూచించాయి.

  ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ కార్యాలయాలు సాయంత్రం మూడు గంటలకు, ఐకియా నుండి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే కార్యాలయాలు సాయంత్రం గం.4.30కు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ కార్యాలయాల ఉద్యోగులు సాయంత్రం మూడు గంటలకు లాగ్ ఔట్ చేయాలని సూచించారు.

ఫేజ్ i- సాయంత్రం 3 గంటలకు: ఐకియా నుండి సైబర్ టవర్స్ రోడ్ వరకు ఉన్న కంపెనీలు

రహేజా మైండ్‌స్పేస్‌లో ఉన్న అన్ని కంపెనీలు.
టీసీఎస్, HSBC డెల్, 
ఫియోనిక్స్ (మాదాపూర్ / కొండాపూర్ అవాన్స్)లోని అన్ని కంపెనీలు.
డెల్, ఒరాకిల్ 8. క్వాల్కమ్, టెక్ మహీంద్రా,
పర్వా సమ్మిట్, వాటర్‌మార్క్‌లోని అన్ని కంపెనీలు, 
ఈ ప్రాంతంలోని ఇతర ఐటీ కంపెనీలు, ఐటీ పార్కులు


ఫేజ్  ii- సాయంత్రం 4.30 గంటలకు: ఐకియా, బయో డైవర్సిటీ, రాయదుర్గం ప్రాంతం

నాలెడ్జ్ సిటీలోని అన్ని కంపెనీలు,
నాలెడ్జ్ పార్క్ 3.7 హబ్‌లో ఉన్న కంపెనీలు.
గెలాక్సీ, ఎల్టీఐ, ట్విట్జాలో ఉన్న అన్ని కంపెనీలు.
కామర్ జిమ్ లో ఉన్న అన్ని కంపెనీలు.
RMZ నెక్సిటీలో ఉన్న కంపెనీలు.
స్కైవ్యూ 10 & 20లో ఉన్న కంపెనీలు.
దియాశ్రీ ఓరియన్‌లో ఉన్న కంపెనీలు.
అసెండాస్‌లో ఉన్న కంపెనీలు.
ఈ ప్రాంతంలోని ఇతర కంపెనీలు/ఐటీ పార్కులు.

దశ iii - సాయంత్రం 3 గంటలకు: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ / గచ్చిబౌలి

మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, సెంటారస్, బ్రాడ్‌వే, వర్చుసా, 
BSR IT పార్క్‌లోని అన్ని కంపెనీలు.
ICICI, వేవ్ రాక్ లోని  అన్ని కంపెనీలు.
అమెజాన్, హనీవెల్, హిటాచీ, సత్ర రాజధాని, క్యాప్ జెమిని.
GARలోని అన్ని కంపెనీలు.
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్,
Q సిటీలోని కంపెనీలు, DLFలోని అన్ని కంపెనీలు.
ఈ ప్రాంతాల్లోని ఇతర కంపెనీలు, ఐటీ పార్కులు.


More Telugu News