హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు చుక్కెదురు

  • శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్
  • అఫిడవిట్ లో తప్పుడు పత్రాలను ఇచ్చారని ఆరోపణ
  • పిటిషన్ కొట్టేయాలన్న శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను కొట్టేసిన హైకోర్టు
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో చుక్కెదురయింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు పత్రాలను సమర్పించారంటూ శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కొట్టివేయాలంటూ హైకోర్టును శ్రీనివాస్ గౌడ్ ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ ను కొట్టివేసింది. రాఘవేంద్రరావు పిటిషన్ ను మాత్రం స్వీకరించింది.


More Telugu News