వర్మ లేకపోతే నేను లేను .. 'గులాబి' లేకపోతే నా కెరియర్ లేదు: జేడీ చక్రవర్తి

  • 'శివ' సినిమాతో పరిచయమైన జేడీ చక్రవర్తి 
  • తాను నటన వైపుకు రావడానికి కారణం ఉత్తేజ్ అని వెల్లడి 
  • 'గులాబి' సినిమా తనని నిలబెట్టిందని వ్యాఖ్య 
  • మిగతా అవకాశాలు ఆ సినిమా తెచ్చిపెట్టిందన్న జేడీ
జేడీ చక్రవర్తి .. 'శివ' సినిమా నుంచి ఎదుగుతూ వచ్చిన హీరో. ఆ తరువాత కాలంలో మెగా ఫోన్ కూడా పట్టుకున్న నటుడు. ఈ మధ్యనే ఆయన వెబ్ సిరీస్ ల పై కూడా దృష్టి పెట్టాడు. ఆయన నటించిన 'దయా' వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చేనెల 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ గురించి ప్రస్తావించాడు. 

"నేను నటన వైపుకు రావడానికి కారకుడు ఉత్తేజ్. నన్ను వర్మకి పరిచయం చేసింది తనే. ఆ తరువాత నుంచి నేను అదే దార్లో ముందుకువెళ్లాను. నేను చేసిన సినిమాల్లో 'ఎగిరే పావురమా ' .. 'బొంబాయి ప్రియుడు' .. 'ప్రేమకు వేళాయెరా' సినిమాలన్నీ చెప్పుకోదగినవే. అయితే ఈ సినిమాలన్నీ నాకు రావడానికి కారణం 'గులాబి'నే. 

'గులాబి' లేకపోతే 'ఎగిరే పావురమా' లేదు. 'బొంబాయి ప్రియుడు'లో రాఘవేంద్రరావు నన్ను పెట్టుకోవడానికి కారణం కూడా అదే. ఆ సినిమా నా కెరియర్ కి పునాది వేసింది. ఆ సినిమాకి నిర్మాత వర్మ అయితే .. కృష్ణవంశీ దర్శకుడు. వర్మ లేకపోతే నేను లేను .. 'గులాబి' లేకపోతే నాకు కెరియర్ లేదు" అంటూ చెప్పుకొచ్చాడు. 



More Telugu News