ఈ సీఎంకు, మధ్యప్రదేశ్ సీఎంకు చాలా తేడా ఉంది: నారా లోకేశ్

  • ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ యువగళం
  • సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తిలో బహిరంగ సభ
  • చెల్లి వాంగ్మూలంతో జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని వెల్లడి
  • మాయాబజార్ సీఎం జగన్ అంటూ విమర్శలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తిలో జనప్రభంజనంగా మారింది. 164వ రోజు యువగళం పాదయాత్ర చీమకుర్తి శివారు ఎన్ఎస్ పి కాలనీవద్ద నుంచి ప్రారంభం కాగా, అడుగడగునా జనం పోటెత్తారు. ఎమ్మార్వో కార్యాలయం సమీపాన బహిరంగసభ వద్దకు చేరుకుంది. నియోజకవర్గం నలుమూలల నుంచి సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు. 
లోకేశ్ ప్రసంగం హైలైట్స్...

చెల్లి వాంగ్మూలంతో ఫ్రస్ట్రేషన్

పిన్ని పసుపు,కుంకాలు చెరిపింది, తాళి తెంచింది సైకో జగనే. గత కొన్నిరోజులుగా ఎక్కడ చూసినా చెల్లెలు ఇచ్చిన వాంగ్మూలమే వస్తోంది, దాంతో జగన్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నాడు. ఈ పరిణామాలన్నీ చూసి పైనున్న వైఎస్, వివేకా ఆత్మలు క్షోభిస్తున్నాయి. 

పైన వైఎస్ గారి ఆత్మ, వివేకా గారి ఆత్మ మాట్లాడుకున్నాయి. వైఎస్ తో వివేకా గారు... నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నయ్యా అన్నారు. ఏమైంది వివేకా ఆలా అంటున్నావ్ అన్నారు వైఎస్. నువ్వు ముందే వచ్చేశావ్... లేదంటే నాకు పట్టిన గతే నీకు పట్టేదన్నారు. ఆమ్మో అంత టార్చర్ నేను తట్టుకోలేను తమ్ముడూ అంటూ వెళ్లిపోయారు వైఎస్.

అదే మానవత్వానికి, సైకోకి తేడా!

మానవత్వం ఉన్న సీఎంకి, సైకో సీఎంకి మధ్య ఎంతో తేడా ఉంది. రావత్ అనే గిరిజనుడిపై దాడి చేసి ఒక వ్యక్తి అతని పై మూత్రం పోశాడు. నిందితుడి తాట తీశారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్. బాధితుడిని ఇంటికి పిలిచి కాళ్లు కడిగి క్షమాపణ చెప్పి ఆదుకున్నారు. 

అలాంటి ఘటనే ఏపీలో జరిగింది. రామాంజనేయులు అనే దుర్మార్గుడు ఒంగోలులో గిరిజన యువకుడు నవీన్ పై దాడి చేసి మూత్రం పోశాడు. నిందితుడి పై యాక్షన్ లేదు... బాధితుడిని పట్టించుకున్నవాడు లేడు.

మాయాబజార్ సీఎం జగన్!

జగన్ మతం, కులం క్యాష్. జగన్ ప్రభుత్వం ఓ మాయాబజార్. ఆఖరికి మెడికల్ కాలేజీల్లో కూడా జగన్ బాదుడే బాదుడు. ఎన్ని కోట్లు ఖర్చయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను ఉచితంగా డాక్టర్లను చేస్తానని మాయ మాటలు చెప్పాడు. ఇప్పుడు మెడికల్ సీట్లు బజార్ లో అమ్మేస్తున్నాడు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు దక్కాల్సిన మెడికల్ సీట్లను జగన్ అమ్ముకుంటున్నాడు. ఇప్పటివరకూ కన్వీనర్ కోటాలో ఏడాదికి రూ.15 వేల ఫీజు. కానీ, మాయాబజార్ జగన్ ఫీజు ఎంత పెంచాడో తెలుసా? ఏడాదికి 20 లక్షలు... ఇంత ఫీజు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు కట్టగలరా? 

ఒక్క సీటు కోటి రూపాయలు, అదీ ప్రభుత్వ మెడికల్ కాలేజిలో. దీనిపై ఏం సమాధానం చెబుతారని వైద్య శాఖ మంత్రి రజనిని అడిగితే, విద్యార్థులు ఇతర దేశాలకు వలస వెళ్లకుండా ఆపడానికి సీట్లు అమ్మకానికి పెట్టారట? 

కిర్గిస్థాన్, జార్జియా, ఫిలిప్పీన్స్‌, ర‌ష్యాలో ఎంబీబీఎస్ చేయ‌డానికి మొత్తం ఆరేళ్లు రానుపోను చార్జీలు, హాస్ట‌ల్‌తో క‌లిసి కూడా గ‌రిష్ఠంగా రూ.35 ల‌క్ష‌లు అవుతుంది. కానీ ఏపీలో మెడిసిన్ చదవాలంటే రూ.కోటి కావాలి.

ఎమ్మెల్యే కలెక్షన్ బాబు లీలలు

సంతనూతలపాడుని అభివృద్ధి లో నెంబర్ వన్ చేస్తారని మీరు సుధాకర్ బాబుని గెలిపించారు. కానీ ఆయన సంతనూతలపాడుని అవినీతి లో నెంబర్ వన్ చేశారు. సాధారణంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవినీతి గురించి తెలుసుకున్న తరువాత నేను ఒక పేరు పెడతాను... కానీ సుధాకర్ బాబు గారు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. 

2019లో కష్టపడి గెలిపించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలే ఆయనకి ముద్దుగా 'కలెక్షన్ బాబు' అని పేరు పెట్టారట. చిల్లర కొట్టు దగ్గర నుండి చీమకుర్తి గ్రానైట్ వరకూ కలెక్షన్ బాబు బాదుడే బాదుడు. 

సెంటు స్థలాల పేరుతో తక్కువ రేటుకి రైతుల దగ్గర భూములు కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్మేశారు ఈ కలక్షన్ బాబు, ఆయన అనుచరులు. సెంటు స్థలాల్లో కలెక్షన్ బాబు వాటా రూ.50 కోట్లు. అక్కడితో ఆగిపోలేదు.... వలంటీర్లను పంపి సెంటు స్థలాల లబ్ధిదారుల దగ్గర ఒక్కొక్కరి నుండి రూ.10 వేలు కొట్టేశారు. 

ప్రభుత్వ ఉద్యోగస్తుల పోస్టింగ్ కోసం కూడా కక్షన్ బాబుకి కప్పం కట్టాల్సిందే. గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానుల్ని టార్చర్ చేస్తున్నారు కలెక్షన్ బాబు. లారీకి రూ.5000 వేలు కమిషన్ కట్టకపోతే లారీ కదలదు. 

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2177.8 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 9.5 కి.మీ.*

*165వరోజు (25-7-2023) పాదయాత్ర వివరాలు*

*సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం (ప్రకాశం జిల్లా)*

సాయంత్రం

4.00 – సంతనూతలపాడు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.45 – సంతనూతలపాడులో స్థానికులతో సమావేశం.

4.50 – సంతనూతలపాడులో బైక్ మెకానిక్స్ తో చిట్ చాట్.

7.05 – ఎండ్లూరు ట్రిపుల్ ఐటి కాలేజి వద్ద స్థానికులతో సమావేశం.

7.10 – ఎండ్లూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

8.40 – పేర్నమిట్టలో స్థానికులతో మాటామంతీ.

9.20 – ఒంగోలు శివారు పాలకేంద్రం వద్ద స్థానికులతో సమావేశం.

9.50 – ఒంగోలు శివారు పాలకేంద్రం వద్ద విడిది కేంద్రంలో బస.

******



More Telugu News