హరీశ్ రావు! మునుగోడులో మేం లేకుండానే గెలిచారా?: సీపీఐ నేత కూనంనేని ఆగ్రహం
- కమ్యూనిస్టులకు కార్యకర్తలు లేరన్న మంత్రి హరీశ్ రావు
- తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కూనంనేని సాంబశివరావు
- గుండెపై చేయి వేసుకొని హరీశ్ రావు ఆ వ్యాఖ్యలు చెప్పాలని నిలదీత
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కమ్యూనిస్ట్ పార్టీలపై చేసిన వ్యాఖ్యల మీద సీపీఐ పార్టీ నేత కూనంనేని సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలకు మనుషులు లేరు.. కార్యకర్తలు లేరని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై సోమవారం కూనంనేని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు లేకుండానే మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడా? అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలను హరీశ్ రావు గుండెపై చేయి వేసుకొని చెప్పాలన్నారు.
కాగా, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్... బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన స్వల్ప మెజార్టీతో గెలిచింది. అయితే ఈ గెలుపుకు కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతివ్వడమే కారణమనే వాదనలు ఉన్నాయి. బీఆర్ఎస్ కు వచ్చిన మెజార్టీ అంతా కమ్యూనిస్ట్ ఓట్ల కారణంగానే వచ్చిందని అంటారు. ఈ నేపథ్యంలో తమ మద్దతు లేకుండానే బీఆర్ఎస్ గెలిచిందా? అని కమ్యూనిస్టులు అధికార పార్టీని పలుమార్లు ప్రశ్నించారు.