LGM మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన సాక్షి సింగ్ ధోని!

  • ఎమ్మెస్ ధోని నిర్మాతగా 'LGM' మూవీ
  • తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ 
  • ఆగస్టు 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు
  • దర్శకుడిగా రమేశ్ తమిళమణి 
క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సినిమాల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ బ్యానర్ పై  నిర్మితమయ్యే సినిమాల వ్యవహారాలను ఆయన శ్రీమతి సాక్షి సింగ్ ధోని చూసుకుంటుంది. అలా తమిళంలో నిర్మితమైన సినిమానే 'LGM'. ఈ సినిమాను తెలుగులోను ఆగస్టు 4వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో సాక్షి సింగ్ ధోని బిజీగా ఉన్నారు. తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రమోషన్ కోసం, హీరో హరీశ్ కల్యాణ్ .. హీరోయిన్ ఇవానా .. నదియాతో, ఇతర బృందంతో కలిసి ఆమె హైదరాబాద్ వచ్చారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలు సందడి చేస్తున్నాయి.ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఈ సినిమా రూపొందింది. రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ఒక అమ్మాయి ఒక ఇంటికి కోడలిగా వెళ్లడానికి ముందు, ఆ అత్తతో పొంతన కుదురుతుందో లేదో తెలుసుకోవడం కోసం ఒక ట్రిప్ ను ప్లాన్ చేయడమే ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సరదా కాన్సెప్ట్ ఆడియన్స్ కి నచ్చింది .. ఇక సినిమా ఎలా ఉంటుందనేది చూడాలి.


More Telugu News