జగన్ సంకల్పం ముందు దుష్టశక్తుల పన్నాగం నిలువలేదు: ఆదిమూలపు
- అమరావతిలో సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోందన్న మంత్రి
- ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించారని ఆరోపణ
- న్యాయస్థానాలూ పేదల పక్షాన నిలబడి ఇళ్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపాయని వ్యాఖ్య
అమరావతి ప్రాంతంలో పేదల సొంతింటి కలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం అన్నారు. ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రైతుల ముసుగులో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు దారుణమన్నారు. అయితే, జగన్ సంకల్పం ముందు దుష్టశక్తుల పన్నాగం నిలువలేదన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు కోర్టు కూడా ఆమోదం తెలిపిందన్నారు. న్యాయస్థానాలు కూడా పేదల పక్షాన నిలబడి, ఇళ్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపాయన్నారు. పేదల ఇళ్ల కార్యక్రమానికి టీడీపీ అడ్డంకులు సృష్టించిందన్నారు.
ప్రతిపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. అన్ని మౌలిక వసతులతో ఈ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. 30 లక్షలకు పైగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులూ సమర్థించాయన్నారు.