'బ్రో' కథను పవన్ కి చెప్పిన మరుసటి రోజునే షూటింగు పెట్టిన సముద్రఖని!

'బ్రో' కథను పవన్ కి చెప్పిన మరుసటి రోజునే షూటింగు పెట్టిన సముద్రఖని!
  • 'బ్రో' సినిమా ప్రమోషన్స్ లో సముద్రఖని 
  • 21 రోజుల్లో పవన్ పోర్షన్ ను పూర్తిచేశానని వెల్లడి
  • ఇతర భాషల్లోను రిలీజ్ చేయనున్నామని వ్యాఖ్య
  • సీక్వెల్ గురించి ఇంకా ఆలోచన చేయలేదని వివరణ   
పవన్ కల్యాణ్ కి ఒక కథను వెంటనే చెప్పొచ్చునేమోగానీ, ఆయనతో వెంటనే షూటింగును చేయడం మాత్రం అంత తేలిక కాదు. ఎందుకంటే ఒక వైపున రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్న ఆయన, తన వీలును బట్టి ఆల్రెడీ కమిటైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయినా చాలా వేగంగా ఆయనతో సినిమాను పూర్తిచేసి సముద్రఖని షాక్ ఇచ్చారు. 

తమిళంలో దర్శకుడిగా 'వినోదయా సితం' సినిమాను చేసి హిట్ కొట్టిన సముద్రఖని, అదే కథను తెలుగులో 'బ్రో' సినిమాగా తెరకెక్కించారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. 

"పవన్ కల్యాణ్ గారికి నేను 'బ్రో' కథను చెప్పాను. తనకి కథ చాలా బాగా నచ్చిందని చెప్పిన పవన్ సార్, 'ఎప్పటి నుంచి షూటింగు పెట్టుకుందాం?' అని అడిగారు. 'రేపటి నుంచి పెట్టుకుందాం సార్' అన్నాను నేను. ఆ మాట అనగానే ఒక్కసారిగా ఆయన ఆశ్చర్యపోయారు. 'మిగతా విషయాలు నేను చూసుకుంటాను .. రేపు మీరు ఫలానా చోటుకి వచ్చేయండి' అన్నాను. 

అలా ఆ రోజు నుంచి పవన్ గారు నేను ఎప్పుడు షూటింగు పెట్టుకుంటే అప్పుడు వచ్చారు. ఆయనకి సంబంధించిన పోర్షన్ ను 21 రోజులలో పూర్తిచేశాను. పవన్ కెరియర్లో చాలా తక్కువ రోజుల్లో పూర్తయిన సినిమా ఇదే. ఈ సినిమాను ఇతర భాషల్లోను రిలీజ్ చేసిన తరువాత సీక్వెల్ గురించిన ఆలోచన చేస్తానని చెప్పుకొచ్చారు. 



More Telugu News