రేపే 'బ్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్!

  • ఈ నెల 28వ తేదీన విడుదల కానున్న 'బ్రో'
  • రేపు శిల్పకళా వేదికలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • అభిమానుల్లో ఇప్పటికే పెరిగిన అంచనాలు
  • వసూళ్ల పరంగా కొత్త రికార్డులు ఖాయమనే టాక్  
పవన్ కల్యాణ్ - సాయితేజ్ హీరోలుగా 'బ్రో' సినిమా రూపొందింది. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ డేట్ కోసమే పవన్ అభిమానులందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి ప్లాన్ చేశారు. ఈ నెల 25వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులోని శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. కొంతసేపటి క్రితమే ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇది రెగ్యులర్ గా కనిపించే పాయింట్ కాదు. మొదటి నుంచి చివరివరకూ వినోదభరితంగా సాగే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే - సంభాషణలు త్రివిక్రమ్ అందించడం వలన, అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ తో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాలి.


More Telugu News