నరసరావుపేటలో అభిమానుల మృతిపై స్పందించిన సూర్య
- సూర్య ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌కు గురై చనిపోయిన ఇద్దరు విద్యార్థులు
- మృతుల కుటుంబసభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడిన సూర్య
- ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని భరోసా
తమిళ హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఫ్లెక్సీ ఐరన్ ఫ్రేమ్ పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తాకడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న సూర్య.. మృతుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు వీడియో కాల్ చేసి.. వారిని పరామర్శించారు. వాళ్లకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. మృతుడి సోదరి తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం ఇప్పించాలని కోరగా.. తప్పకుండా ఆమె బాధ్యత తీసుకుంటానని సూర్య తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానని, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.