'కంగువ' అంటే అర్థం ఇదే .. 10 భాషల్లోను ఇదే టైటిల్!

  • కోలీవుడ్ భారీ చిత్రంగా రూపొందుతున్న 'కంగువ'
  • డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న సూర్య
  • అంచనాలు పెంచేసిన ఫస్టు గ్లింప్స్ 
  • ఆయన కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది 
  • 10 భాషల్లోను ఒకే టైటిల్ తో రిలీజ్
సూర్య అభిమానులంతా ఇప్పుడు 'కంగువ' అనే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ - యూవీ క్రియేషన్స్ వారు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. డిఫరెంట్ లుక్ తో సూర్య కనిపిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఒకటి .. రెండు నెలల్లో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంటుందని అంటున్నారు.

తమిళంలో 'కంగువ' అంటే అగ్నిలా దేనినైనా దహించే శక్తి కలిగినవాడు .. అత్యంత పరాక్రమవంతుడు అనే అర్థాలు ఉన్నాయి. నిన్న ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేసిన తరువాత, కథకి తగిన టైటిల్ అనే అనిపించింది. ఇక అసలు ఈ టైటిల్ కి అర్థం తెలియని వారికి ఈ సౌండింగ్ బాగా నచ్చింది .. ఆసక్తిని పెంచింది.

అందువల్లనే ఈ సినిమాను విడుదల చేయనున్న 10 భాషల్లోను ఇదే టైటిల్ ను ఉంచనున్నారట. సూర్య కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిశా పటాని కథానాయికగా నటించే ఈ సినిమాలో, బాబీ డియోల్ .. జగపతిబాబు .. యోగిబాబు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. 


More Telugu News