మార్నింగ్ వాక్ చేస్తున్న అసోం డీఐజీ ఫోన్ చోరీ!
- గువాహటి నగరంలో ఆదివారం వెలుగు చూసిన ఘటన
- పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు కూతవేటు దూరంలోనే దొంగతనానికి తెగబడ్డ నిందితులు
- దొంగల కోసం పోలీసుల గాలింపు
- పోలీసు శాఖకు తలవంపులు అంటూ ఉన్నతాధికారుల వ్యాఖ్య
మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ డీఐజీ వద్ద నుంచి దొంగలు ఫోన్ చోరీ చేసిన ఘటన అసోంలోని గువాహటి నగరంలో వెలుగు చూసింది. లా అండ్ ఆర్డర్ విభాగం అధికారి వివేక్ రాజ్ సింగ్ ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన దొంగలు ఆయన ఫోన్‌ను లాక్కుని వెళ్లిపోయారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు కూతవేటు దూరంలో ఉన్న మాజర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఆ రోడ్డులో అనేక మంది ఐపీఎస్ అధికారుల అధికారిక నివాసాలు కూడా ఉండటం గమనార్హం.
ఈ ఘటనపై స్పందించిన గువాహటి పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ప్రీతిబీ రాజ్‌ఖోవా.. పల్టన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చోరీ జరిగిందని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు, ఈ ఘటన పోలీసు శాఖకు తలవంపులని కొందరు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.