భారత్‌తో ఎమర్జింగ్ ఆసియా కప్​ ఫైనల్.. దంచికొడుతున్న పాకిస్థాన్​ ఓపెనర్లు

  • టాస్ నెగ్గి బౌలింగ్‌  ఎంచుకున్న భారత్–ఎ
  • 15 ఓవర్లలోనే వంద పరుగులు రాబట్టిన పాక్‌
  • కొలంబోలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ ఆసియా కప్‌ లో భారత్, పాకిస్థాన్ యువ జట్ల మధ్య ఫైనల్ కొలంబోలో మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి భారత్–ఎ కెప్టెన్ యశ్ ధుల్ అనూహ్యంగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కొలంబో ప్రేమదాస స్టేడియంలో స్లో పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తుందని అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ, అతని నిర్ణయానికి బౌలర్లు ఆరంభంలో సరైన న్యాయం చేయలేకపోయారు. జట్టుకు శుభారంభం అందించలేకపోయారు.

మరోవైపు టాస్ ఓడి బ్యాటింగ్‌ కు వచ్చిన పాకిస్థాన్ కు ఆ జట్టు ఓపెనర్లు సయిమ్ ఆయుబ్, సహిబ్జదా ఫర్మాన్ శుభారంభం ఇచ్చారు. స్వేచ్ఛగా బౌండ్రీలు కొడుతున్న ఈ ఇద్దరు 15 ఓవర్లోలోనే 103 పరుగులు జోడించారు. ఇద్దరూ అర్ధ శతకాల దిశగా దూసుకెళ్తున్నారు. ఈ టోర్నీలో గ్రూప్‌ దశలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌ లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.


More Telugu News