వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై ఏమన్నారంటే?

  • ఎన్నికల్లో పోటీ వార్తలపై స్పందించిన తెలంగాణ గవర్నర్
  • తాను పోటీ చేసే విషయం దేవుడు, బీజేపీ పాలకులు నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్య
  • పుదుచ్చేరికి కూడా గవర్నర్‌‌గా ఉన్న తమిళిసై
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తో సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి అస్సలు పడటం లేదు. ప్రభుత్వ పనితీరుపై తమిళిసై, ఆమె వ్యవహారశైలిపై సీఎం కేసీఆర్ అండ్ కో నేరుగా విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు తరచూ విమర్శిస్తున్నారు. మరోవైపు వచ్చే యేడాది జరగనున్న ఎన్నికల్లో తమిళిసై పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తమిళిసై స్పందించారు. 

తాను పోటీ చేసే విషయంపై పైనున్న దేవుడు, కేంద్రంలోని బీజేపీ పాలకులు నిర్ణయం తీసుకుంటారని పుదుచ్చేరికి కూడా గవర్నర్‌ గా వ్యవహరిస్తున్న తమిళిసై చెప్పారు. నిన్న పుదుచ్చేరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమిళిసైని అక్కడి మీడియా మీరు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల గవర్నర్‌గా సమర్థవంతంగా పనిచేస్తున్నానని గవర్నర్ చెప్పారు. ఎంపీ పదవికి పోటీ చేసే విషయంపై తనకు తానుగా నిర్ణయం తీసుకోలేనని ఆమె అన్నారు. పైనున్న దేవుడు, పైనున్న పాలకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.


More Telugu News