ఔటిచ్చిన అంపైర్‌పై కోపంతో బ్యాట్‌తో వికెట్లను కొట్టిన భారత కెప్టెన్
- నిన్న భారత్, బంగ్లాదేశ్ మహిళల మధ్య మూడో వన్డే టై
- వివాదాస్పదమైన భారత కెప్టెన్ హర్మన్ ఔట్
- అంపైరింగ్ దారుణంగా ఉందంటూ హర్మన్ విమర్శలు
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సహనం కోల్పోయింది. ఔటైన తర్వాత పట్టారని కోపంతో బ్యాట్లతో సంప్ట్స్‌ను కొట్టేసింది. బంగ్లాదేశ్ జట్టుతో నిన్న జరిగిన మూడో వన్డేలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టైగా ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్ 225/4 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 49.3 ఓవర్లలో సరిగ్గా 225 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో భారత్ ఓ దశలో 160/3 స్కోరుతో సులువుగా గెలిచేలా కనిపించింది. కానీ, 34వ ఓవర్లో నహీదా అక్తర్ వేసిన బంతిని హర్మన్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేసింది. మిస్సయిన బంతి ప్యాడ్లను తగిలింది. బౌలర్ అప్పీల్ చేయడమే తరువాయి అంపైర్ ఎల్బీగా ఔటిచ్చాడు.
అయితే, బంతి ముందుగా బ్యాట్ కు తగిలిందంటూ హర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోపంతో తన బ్యాట్ తో వికెట్లను కొట్టేసింది. పెవిలియన్ కు వెళ్తుండగా ఫీల్డ్ అంపైర్‌తో వాదనకు దిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన కార్యక్రమంలో అంపైరింగ్ పై హర్మన్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ సిరీస్ లో అంపైరింగ్ చాలా దారుణంగా ఉందని, ఎల్బీలతో పాటు క్యాచ్ ఔట్ల విషయంలోనూ అంపైర్లు తప్పిదాలు చేశారని వ్యాఖ్యానించింది. మరోసారి బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చేటప్పుడు ఇలాంటి అంపైరింగ్ కు సిద్ధపడి వస్తామని చెప్పింది. హర్మన్ వికెట్లను కొట్టడం, ఆ తర్వాత అంపైరింగ్ పై చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.