భారత్‌కు దీటుగా బదులిస్తున్న విండీస్
- తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్ అయిన భారత్
- మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసిన విండీస్
- 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన బ్రాత్‌వైట్
భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దారుణంగా ఓటమి పాలైన వెస్టిండీస్ రెండో టెస్టులో దీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 438 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసి భారత్ కంటే 209 పరుగులు వెనకబడి ఉంది.
కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, తేజ్‌నరైన్ చందర్‌పాల్ 33, కిర్క్ మెకంజీ 32, బ్లాక్‌వుడ్ 20, జాషువా డసిల్వ 10 పరుగులు చేశారు. అలిక్ అథనజే 37, జాసన్ హోల్డర్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2 వికెట్లు తీసుకోగా, సిరాజ్, అశ్విన్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీసుకున్నాడు.