పర్సనల్ అటాక్ కు నువ్వు రెడీ అయితే నేను రెడీ... ఆ వీడియోలు నేనే పంపుతా!: సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్

  • పొదిలి పట్టణంలో లోకేశ్ యువగళం
  • పాత బస్టాండు సెంటర్ లో భారీ బహిరంగ సభ
  • సీఎం జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన లోకేశ్
  • క్యారెక్టర్ లెస్ ఫెలో అంటూ విమర్శలు
  • స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేయక జాగింగ్ చేస్తామా? అంటూ సెటైర్ 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు పొదిలి పట్టణంలో జనం పోటెత్తారు. పొదిలి పాతబస్టాండు సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. సభాస్థలికి నలుదిక్కులా రోడ్లన్నీ కిటకిటలాడాయి. 

ఈ సభలో లోకేశ్ ప్రసంగిస్తూ సీఎం జగన్ పై తనదైన శైలిలో విమర్శలు, సెటైర్లతో విరుచుకుపడ్డారు. తన పాత వీడియోలు, ఫొటోలపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల లోకేశ్ మండిపడ్డారు. ఒక క్రిమినల్ నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. 

చెల్లి వ్యక్తిత్వాన్నే కించపర్చిన క్యారెక్టర్ లెస్ ఫెలో జగన్

ఒక క్రిమినల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు, ఏపీలో అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతా అని మా బాబు అనలేదు జగన్, మీ బాబే అన్నాడు, సొంత తండ్రే నిన్ను రాష్ట్రంలో అడుగుపెట్టవద్దని అన్నాడంటే నీ క్యారెక్టర్ ఎంత వరస్టో అర్ధమవుతుంది. 

పదో తరగతి పేపర్లు కొట్టేసి నేను జైలుకెళ్లలేదు... సొంత తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటకి గెంటేసే చీప్ క్యారెక్టర్ నాది కాదు... సొంత బాబాయ్ ని లేపేసి గుండెపోటు కథ చెప్పే క్యారెక్టర్ నాది కాదు... సొంత చెల్లి క్యారెక్టర్ మంచిది కాదని చెప్పిన క్యారెక్టర్ లెస్ ఫెలో జగన్. 

నాకు క్యారెక్టర్ ఉంది... క్యాలిబర్ ఉంది, ఏ తప్పు చెయ్యలేదు కాబట్టే జనంలో తలెత్తుకొని తిరుగుతున్నా. నీది చీప్ క్యారెక్టర్ కాబట్టే పరదాలు కట్టుకొని తిరుగుతున్నావ్. నాది కాలేజ్ లైఫ్... నీది జైల్ లైఫ్... నాకు కాలేజ్ మేట్స్ ఉంటే నీకు జైల్ మేట్స్ ఉంటారు. పర్సనల్ ఎటాక్ చేస్తానంటే నేను రెడీ... నువ్వు రెడీనా?

వాట్సాప్ లో చూడాల్సిన కర్మ నీకెందుకు జగన్...?

పీకడానికి ఏమి లేక పబ్జి ఆడుకుంటూ యూట్యూబ్ వీడియోలు చూసుకుంటున్నాడు. నాది స్విమ్మింగ్ పూల్ వీడియో చూశాడట. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చెయ్యకపోతే జాగింగ్ చేస్తామా? 

20 సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్ తో స్విమ్మింగ్ కి వెళ్ళాను... అందులో తప్పేంటి? ఫ్రస్ట్రేటెడ్ బాయ్ జగన్... యూట్యూబ్ లో చూడాల్సిన కర్మ నీకెందుకు, నన్ను అడిగితే నేను స్విమ్మింగ్ చేసే వీడియో నీకు వాట్సప్ లో పంపేవాడిని. 

మాకు యూట్యూబ్ వీడియోలు అవసరం లేదు జగన్, గూగుల్ టేకవుట్ చాలు... ఎవరు ఎవరికి కాల్ చేశారు, ఎంత టైం మాట్లాడుకున్నారు. వాళ్లిద్దరూ అన్నిసార్లు కాల్స్ ఎందుకు మాట్లాడుకున్నారో తెలిస్తే నీకు గుండెపోటు వస్తుంది.

బాబాయి ఆత్మ జగన్ ను వెంటాడుతోంది!

జగన్ కి ఆత్మలతో మాట్లాడే జబ్బు ఉంది. అన్ని ఆత్మలతో మాట్లాడి బాబాయ్ ఆత్మతో మాత్రం మాట్లాడటం లేదు. బాబాయ్ ఆత్మకి కోపం వచ్చింది. అందుకే బాబాయ్ ఆత్మ జగన్ ని వెంటాడుతుంది. సొంత చెల్లి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చింది. ఏంటో తెలుసా? అది జగనాసుర రక్త చరిత్ర అని సొంత చెల్లి చెప్పేసింది. 

జగన్ ఇప్పుడు అడుగుతున్నా మొహం ఎక్కడ పెట్టుకుంటావ్? రాజకీయ కారణాలతోనే బాబాయ్ ని అబ్బాయిలు లేపేశారని చెల్లి చెప్పేసింది. కోల్డ్ వార్ కాస్తా బ్లడ్ వార్ గా మారింది అని చెల్లి వాంగ్మూలం ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి... పిన్ని పసుపు, కుంకుమ చెరిపేసింది ఎవరు? పిన్ని తాళి తెంచింది ఎవరు? చెల్లిపై నిందలు వేసింది ఎవరు? జగనా... కాదా!

మార్కాపురంలో చోటా నయీమ్ గ్యాంగ్!

మార్కాపురంలో దొంగలు పడ్డారు. ఆ దొంగ గ్యాంగ్ పేరు చోటా నయీమ్ గ్యాంగ్. ఈ గ్యాంగ్ కి హెడ్ నాగార్జున రెడ్డి, తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి, మామ ఉడుముల శ్రీనివాస రెడ్డి, బావమరిది ఉడుముల అశోక్ రెడ్డి, పాండురంగా రెడ్డి... ఈ చోటా నయీమ్ గ్యాంగ్ సభ్యులు. ఈ గ్యాంగ్ రాష్ట్రంలోనే అతి పెద్ద భూకుంభకోణానికి పాల్పడింది. 

మార్కాపురం మెడికల్ కాలేజీ చుట్టుపక్కల ఉన్న రాయవరం, ఇడుపూరు, గోగులదిన్నె, గుబ్బూరు గ్రామాల్లో 378 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేశారు. ఒక్కో ఎకరం విలువ ఎంతో తెలుసా? రూ. 2 కోట్లు. మొత్తం స్కాం విలువ రూ.750 కోట్లు. ఈ స్కాం వెనుక క్విడ్ ప్రో కో ఉంది. ఈ స్కాంలో జగన్ కి కూడా వాటా ఉంది. 

మెడికల్ కాలేజీ వస్తుందని తెలుసుకుని కుందూరు సురారెడ్డి, మస్తాన్ వలీ, ఎల్లయ్య ఇలా అనేక మంది బినామీల పేర్లతో 378 ఎకరాలు కొట్టేశారు. ఆ ఆధారాలు నేను ఈ బహిరంగ సభ వేదికగా బయటపెడుతున్నాను.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2152.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 15.4 కి.మీ.*

*163వరోజు (23-7-2023) పాదయాత్ర వివరాలు*

మార్కాపురం/సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాలు (ప్రకాశం జిల్లా)

మధ్యాహ్నం

2.00 – తలమళ్లలో పొగాకు రైతులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – తలమళ్ల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

5.00 – తలమళ్లలో రైతులతో సమావేశం.

5.45 – గోగినేనివారిపాలెంలో స్థానికులతో సమావేశం.

6.45 – ఉప్పలపాడులో స్థానికులతో సమావేశం.

7.45 – పాదయాత్ర సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

8.15 – మర్రిచెట్లపాలెంలో స్థానికులతో మాటామంతీ.

9.00 – బూదవాడలో స్థానికులతో సమావేశం.

9.30 – రామతీర్థంలో స్థానికులతో సమావేశం.

12.00 – చీమకుర్తి శివారు విడిది కేంద్రంలో బస.

******


More Telugu News