తెలంగాణలోని దివ్యాంగులకు గుడ్‌న్యూస్.. రూ.4,016కు పెరిగిన ఆసరా పెన్షన్

  • శనివారం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన పలువురు మంత్రులు
  • ఎన్నడూ లేనివిధంగా పెంచినట్లు హరీశ్ రావు ట్వీట్
దివ్యాంగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆసరా పెన్షన్లను రూ.4,016కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన పెన్షన్ జులై నుండే అమలులోకి వస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఆసరా పెన్షన్ పెంపుపై మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

'దేశంలో మునుపెన్నడూ లేని విధంగా, వికలాంగుల పెన్షన్‌ను నెలకు రూ.4,016కి పెంచారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం 5 లక్షల మందికి పైగా వికలాంగ పెన్షన్ దారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరినీ కలుపుకొని ముందుకు సాగే ప్రగతిశీల బీఆర్ఎస్ ప్రభత్వానికి నిదర్శనమ'ని హరీశ్ రావు ట్వీట్ చేశారు. అదే ట్వీట్ లో జీవోకు సంబంధించిన కాపీని అటాచ్ చేశారు.


More Telugu News