ప్యారిస్-బెంగళూరు విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం చేసిన ఏపీ వ్యక్తి

  • జులై 15న ఎయిర్ ప్యారిస్ విమానంలో ఘటన
  • బెంగళూరులో దిగిన తర్వాత ఫిర్యాదు చేసిన సిబ్బంది
  • జులై 16న మోహిత్ వెంకట్ అరెస్ట్.. ఆ తర్వాత బెయిల్ పై విడుదల
అంతర్జాతీయ విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 29 ఏళ్ల డేటా ఇంజినీర్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు! ఈ ఘటన జులై 15వ తేదీన ప్యారిస్ నుండి బెంగళూరు వస్తున్న విమానంలో జరిగింది. విమానం బెంగళూరులో దిగిన తర్వాత అతనిని అదుపులోకి తీసుకున్నారు. డోర్ తీయడానికి ప్రయత్నించిన వ్యక్తిని రాజమండ్రికి చెందిన వెంకట్ మోహిత్ గా గుర్తించారు.

 వెంకట్ తన బంధువులను చూసేందుకు ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ప్యారిస్ నుండి బెంగళూరుకు ప్రయాణిస్తున్నాడు. అయితే సాధారణ సమయంలోను ఉపయోగించని ఎమర్జెన్సీ డోర్ ను తెరిచేందుకు అతను ప్రయత్నించాడు. విమానం బెంగళూరులో ల్యాండ్ అయ్యాక ఎయిర్ ఫ్రాన్స్ సిబ్బంది ఎయిర్ పోర్ట్ అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసుకొని, జులై 16న అతనిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను బెయిల్ పైన బయట ఉన్నాడు.


More Telugu News