నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద

  • ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,988 క్యూసెక్కులు
  • నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు
  • ప్రస్తుతం 517 అడుగులకు చేరిన నీటిమట్టం 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో కృష్ణా నదిపై ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 517 అడుగులకు చేరింది. సాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 143.86 టీఎంసీల నీరు ఉంది. వరద నేపథ్యంలో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,988 క్యూసెక్కులుగా ఉంది. 

రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ సంస్థ పేర్కొన్న నేపథ్యంలో, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చే అవకాశమున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.


More Telugu News