చంపడం జగన్ బ్లడ్ లోనే ఉంది: నిమ్మల రామానాయుడు

  • పోలవరం పాలిట జగన్ శనిలా తయారయ్యారని నిమ్మల తీవ్ర వ్యాఖ్యలు
  • కమిషన్లకు కక్కుర్తి పడటం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని విమర్శ
  • పోలవరంను నిషేధిత ప్రాంతంగా ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్
పోలవరం ప్రాజెక్టుపై 21 ప్రశ్నలను సంధిస్తూ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బహిరంగ లేఖను రాశారు. పోలవరం పాలిట జగన్ శనిలా తయారయ్యారని లేఖలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని అన్నారు. ప్రాజెక్టు పనులను జగన్ చేపడుతున్న తీరును చూస్తే 2030 నాటికైనా ప్రాజెక్టు పూర్తి అవుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయని ఎద్దేవా చేశారు. కమిషన్లకు కక్కుర్తి పడటం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పోలవరంకు అవార్డులు వచ్చాయని, జగన్ హయాంలో చివాట్లు వస్తున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్రోహం, విధ్వంసం, చంపడం జగన్ బ్లడ్ లోనే ఉందని అన్నారు.


More Telugu News