ఏపీ, తెలంగాణలోని ఈ రైల్వేస్టేషన్లకు జాక్‌పాట్!

  • ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ స్టేషన్ల జాబితా ప్రకటించిన కేంద్రం
  • దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 64 స్టేషన్లకు చోటు
  • వీటిని నిరంతరం అభివృద్ధి చేయనున్న రైల్వే శాఖ
  • అత్యాధునిక సౌకర్యాలతో రూపుమార్చుకోనున్న స్టేషన్లు
ఏపీ, తెలంగాణలోని రైల్వేస్టేషన్లు జాక్‌ పాట్‌ కొట్టేశాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’లో స్థానం సంపాదించాయి. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 1,309 స్టేషన్లను ఎంపిక చేయగా.. ఇందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 64 స్టేషన్లు ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌ పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌ పరిధిలో అనంతపురం, ధర్మవరం జంక్షన్, గుంతకల్, గుంటూరు, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ టౌన్, నాందేడ్, నెల్లూరు, రాయచూర్, రాజమండ్రి, సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, వరంగల్, అనకాపల్లి, భీమవరం టౌన్, కడప, జులూరు, కాజీపేట, ఏలూరు, గోదావరి, ఖమ్మం, ఒంగోలు, సామర్లకోట, తెనాలి, చీరాల, కర్నూలు టౌన్, డోన్, ఆదోని, మంత్రాలయం రోడ్, మచిలీపట్నం, మంచిర్యాల్, పాలకొల్లు, రామగుండం, తాడేపల్లిగూడెం, తాండూరు, తణుకు, తుని, యాదగిరి, డోర్నకల్, గుడివాడ, గూడూరు, నిడదవోలు, పాకాల, పూర్ణ, రేణిగుంట, వికారాబాద్, అన్నవరం, బాసర్, భద్రాచలం రోడ్, బీదర్, నల్గొండ, శ్రీకాళహస్తి, నంద్యాల, నిజామాబాద్, నాగర్‌సోల్, పర్భణి, ఔరంగాబాద్, పర్లివైద్యనాథ్, రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి

ఈ పథకం కింద ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లను నిరంతరం అభివృద్ధి చేస్తుంటారు. స్టేషన్ యాక్సెస్, సర్క్యులేటింగ్ ఏరియాలు, వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్లు, లిఫ్ట్, ఎస్కలేటర్లు, పరిశుభ్రత, ఉచిత వై-ఫై లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి స్టేషన్ ఉన్న ప్రాంతం, అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి అభివృద్ధి జరుగుతుంది.


More Telugu News