ఆ డైలాగ్ రాసినందుకు సారీ చెబుతున్నాను: 'బేబి' డైరెక్టర్ సాయిరాజేశ్
- వసూళ్ల పరంగా దూసుకుపోతున్న 'బేబి'
- దర్శకుడిగా సాయిరాజేశ్ కి అభినందనలు
- బూతు డైలాగ్స్ వలన ఈ సినిమా ఆడటం లేదన్న దర్శకుడు
- సందేశం ఇచ్చే ప్రయత్నం చేయలేదని వ్యాఖ్య
ఇప్పుడు ఎక్కడ చూసినా యూత్ లో 'బేబి' సినిమాను గురించిన టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సాయిరాజేశ్ కి ప్రముఖుల ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఆయన 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమా గురించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
"ఈ సినిమా బాగానే ఆడుతుందని అనుకున్నాను గానీ, ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. ఈ సినిమాకి బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి .. పాప్యులర్ వెబ్ సైట్స్ 2.25 మాత్రమే రేటింగ్ ఇచ్చాయి. బూతు డైలాగ్స్ వల్లనే ఈ సినిమా ఆడుతుందనడంలో నిజం లేదు. సినిమాలో ఒక బూతు డైలాగ్ .. హీరోయిన్ పట్ల హీరోకి గల ప్రేమ గాఢతను చెప్పడం కోసం రాశాను. 'ముందు తెరవాల్సింది కళ్లు కాదు .. ' అనే మరో బూతు డైలాగ్ రాశాను .. అందుకు నేను సారీ చెబుతున్నాను. ఆ డైలాగ్ రాయకుండా ఉండాల్సింది" అన్నాడు.
"ఇది ఒక లవ్ స్టోరీ అనుకుని థియేటర్స్ కి వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. థియేటర్స్ వైపు నుంచి కూడా అదే మాట చెప్పారు. కానీ ఈ రోజున ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తున్నారు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ విషయానికొస్తే, పరిస్థితుల వలన ఆ అమ్మాయి తప్పు చేసిందని చూపించాను. అంతే తప్ప ఆ అమ్మాయి పాత్ర వైపు నుంచి ఎలాంటి సందేశం ఇచ్చే ప్రయత్నం చేయలేదు" అంటూ చెప్పుకొచ్చాడు.