ఎమర్జింగ్ టీమ్స్ ఆసియాకప్.. ఇండియా-బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య గొడవ.. వీడియో వైరల్!
- శ్రీలంకలో జరుగుతున్న ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ మెన్స్ ఆసియాకప్
- సౌమ్య సర్కార్ అవుటైన తర్వాత మైదానంలో ఉద్రిక్తత
- ఆటగాళ్లు, అంపైర్ జోక్యంతో సద్దుమణిగిన వివాదం
- బంగ్లాదేశ్‌పై గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టిన భారత్
- రేపు పాకిస్థాన్‌తో ఫైనల్స్
శ్రీలంకలో జరుగుతున్న ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ మెన్స్ ఆసియాకప్ 2023లో భారత-ఎ జట్టు అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 51 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా జూనియర్ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది. రేపు (ఆదివారం) కొలంబోలో జరగనున్న ఫైనల్‌లో భారత్-పాక్ జట్లు తలపడతాయి.
మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్-ఎ ఆటగాడు సౌమ్య సర్కార్, ఇండియా-ఎ పేసర్ హర్షిత్ రాణా మధ్య మైదానంలో గొడవ జరిగింది. యువరాజ్ సిన్హ్ దోడియా బౌలింగులో నికిన్ జోస్‌కు క్యాచ్ ఇచ్చి సౌమ్య సర్కార్ అవుటయ్యాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో సౌమ్య సర్కార్‌కు హర్షిత్ రాణా సెండాఫ్ ఇవ్వడం ఉద్రిక్తతకు కారణమైంది. సహనం కోల్పోయిన సౌమ్య అతడితో గొడవకు దిగాడు. మైదానంలో ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అంపైర్ ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూసేయండి!