పెళ్లిలో అల్లుడికి పాములే కట్నం!
- చత్తీస్‌ఘడ్‌లోని కోర్బా ప్రాంతంలో వందల ఏళ్లనాటి సంప్రదాయం
- కట్నంగా 9 జాతులకు చెందిన 21 పాములు
- పాముల కానుక లేనిదే యువతులకు పెళ్లిళ్లు కాని వైనం
- పాములు ఆడించడమే వారి జీవనాధారం కావడంతో ఈ తరహా కట్నానికి ప్రభుత్వ ఆమోదం
అల్లుడికి కట్నకానుకలంటే నగానట్రా, ఇళ్లు, వాహనాలు లాంటివేవో ఇస్తారని ఎవరైనా అనుకుంటారు. కానీ చత్తీస్‌ఘడ్‌లోని ఓ ప్రాంతంలో మాత్రం కొత్త అల్లుళ్లకు కట్నంగా పాములను ఇస్తుంటారు. కోర్బా ప్రాంతానికి చెందిన ఓ గిరిజన తెగలో తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం ఇది. వివాహ సమయంలో సన్వారా తెగలోకి వధువు తరుపువారు వరుడికి మొత్తం 9 జాతులకు చెందిన 21 పాములను కట్నంగా ఇస్తారు. అసలు ఈ కట్నం ఇవ్వనిదే అక్కడి ఆడపిల్లలకు పెళ్లిళ్లే కావట.
తమ పూర్వీకులు 60 పాములను ఇచ్చేవారని కటంగి అనే గిరిజనుడు తెలిపాడు. పరిస్థితుల రీత్యా ప్రస్తుతం ఈ సంఖ్య 21కి తగ్గిందని చెప్పుకొచ్చారు. ఇది వందల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం కావడంతో ప్రభుత్వం కూడా అనుమతులు ఇస్తోందని అటవీ రేంజ్ అధికారి సియారమ్ తెలిపారు. పాములను ఆడించడం ఈ తెగ జీవనాధారం అని వివరించారు.