ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాసిన యూపీ మంత్రి
- ఉత్తరప్రదేశ్ క్యాబినెట్లో మత్స్యశాఖ మంత్రిగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ నిషాద్
- మత్స్యకారుల ప్రయోజనం కోసం కృషి చేయాలని ప్రధానికి విజ్ఞప్తి
- మత్స్యకారుల సమాజానికి తన జీవితం అంకితమని వెల్లడి
ఉత్తరప్రదేశ్ మంత్రి ఒకరు ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ కుమార్ నిషాద్ ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో మత్స్యశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
ఆయన తాజాగా ప్రధాని మోదీని ఉద్దేశించి రక్తంతో లేఖ రాశారు. మత్స్యకారుల ప్రయోజనాల కోసం తోడ్పాటు అందించాలని కోరారు. తమ నిషాద్ పార్టీ మత్స్యకారుల ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేశామని, మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధే తమ పార్టీ ధ్యేయమని వివరించారు. తన జీవితం మత్స్యకారుల సమాజానికి అంకితం అని మంత్రి సంజయ్ కుమార్ నిషాద్ తెలిపారు. కేంద్రం కూడా మత్స్యకారుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేశారు.
ఇలా రక్తంతో లేఖలు రాయడం డాక్టర్ సంజయ్ కుమార్ నిషాద్ కు కొత్తకాదు. గత యూపీ ఎన్నికల సమయంలోనూ ప్రధానికి, సీఎం ఆదిత్యనాథ్ కు రక్తంతో లేఖలు రాసి అందరి దృష్టిని ఆకర్షించారు.