అప్పుడు పవన్, చంద్రబాబు ముసుగు తన్ని పడుకున్నారు: ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి
- కరోనా సమయంలో వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారన్న మంత్రి
- ఆ రోజు వాలంటీర్లకు బాస్ ఎవరో తెలియదా? అని ప్రశ్న
- నాలుగేళ్లుగా వాలంటీర్లు సేవ చేస్తున్నారన్న అమర్నాథ్ రెడ్డి
కరోనా సమయంలో గ్రామ వాలంటీర్లు ప్రజలకు ఎంతో సేవ చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కనీసం రాష్ట్రంలో లేకుండా హైదరాబాద్ లో ముసుగు తన్ని పడుకున్నారని ధ్వజమెత్తారు. కానీ వాలంటీర్లు నాలుగేళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. వాలంటీర్లకు బాస్ ఎవరు? అని జనసేనాని ప్రశ్నిస్తున్నారని, కరోనా సమయంలో వాలంటీర్లు సేవ చేసిన రోజు ఆ బాస్ ఎవరో తెలియదా? అని ఎద్దేవా చేశారు.