వివేకా హత్య కేసులో సాక్షిగా రిటైర్డ్ సీఎస్ అజేయ కల్లం వాంగ్మూలం... వివరాలు ఇవిగో!

  • 2019లో దారుణ రీతిలో హత్యకు గురైన వైఎస్ వివేకా
  • కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ
  • సాక్షుల నుంచి వాంగ్మూలాల సేకరణ... కోర్టుకు సమర్పణ
  • వాంగ్మూలాల తాలూకు వివరాలు తాజాగా వెల్లడైన వైనం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వివిధ సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించిన దర్యాప్తు సంస్థ సీబీఐ, గత నెల 30న వాటిని కోర్టుకు సమర్పించింది. వివేకా హత్య కేసులో రిటైర్డ్ సీఎస్ అజేయ కల్లంను కూడా సాక్షిగా పేర్కొని, ఆయన వాంగ్మూలాన్ని కూడా సీబీఐ నమోదు చేసింది. 

తాజాగా, అజేయ కల్లం వాంగ్మూలం వివరాలు వెల్లడయ్యాయి. 

"లోటస్ పాండ్ లో ఉండగా ఉదయం 5.30 గంటలకు జగన్ అటెండర్ తలుపు కొట్టారు. వైఎస్ భారతి మేడపైకి రమ్మంటున్నారని ఆ అటెండర్ జగన్ కు చెప్పారు. బయటికి వెళ్లిన 10 నిమిషాల తర్వాత జగన్ మళ్లీ వచ్చారు. బాబాయ్ ఇక లేరని జగన్ నిలబడే మాకు చెప్పారు" అని వివరించారు. 

కాగా, ఈ కేసులో సీబీఐ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ అటెండర్ గోపరాజు నవీన్, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, నాటి వైసీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ సీఎస్ అజేయ కల్లంను సాక్షులుగా పేర్కొంది. 

2019 మార్చి 15న జగన్ లోటస్ పాండ్ లో ఉన్నట్టు సాక్షులు తమ వాంగ్మూలంలో చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోపై చర్చించేందుకు వేకువజామునే సమావేశమైనట్టు తెలిపారు.


More Telugu News