పవన్ పై కేసు పెట్టడం హేయమైన చర్య: రఘురామకృష్ణరాజు
- జనసేనాని వాలంటరీ వ్యవస్థలోని లోపాలపై మాత్రమే మాట్లాడారన్న ఎంపీ
- వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా పని చేయడం లేదని మాత్రమే అన్నారని వెల్లడి
- ఇది తొక్కలో కేసు అని ఘాటు వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థలోని లోపాలపై మాత్రమే మాట్లాడారని, ప్రభుత్వాన్ని కించపరచలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. జనసేనానిపై కేసు పెట్టడానికి ప్రభుత్వం అనుమతివ్వడం హేయమైన చర్య అన్నారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు గాను ప్రభుత్వం విచారణకు అనుమతిచ్చిన అంశంపై నేటి తన రచ్చబండ కార్యక్రమంలో రఘురామ మాట్లాడారు.
వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా పని చేయడం లేదని మాత్రమే పవన్ అన్నారని, వాలంటీర్లను, ప్రభుత్వాన్ని అనలేదన్నారు. వాలంటీర్లు సేకరించిన డేటాను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని తప్పుబట్టాడన్నారు. అసలు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులే కాదన్నారు. ఈ కేసే చెల్లదన్నారు. పవన్ ప్రభుత్వాన్ని ఏమీ అనలేదు, అదే సమయంలో వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి పవన్ కేసు కోర్టులో చెల్లదన్నారు. ఇది తొక్కలో కేసు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ కేసు ద్వారా పవన్ ను ఏం చేయలేరన్నారు. ఈనాడు, మార్గదర్శి సంస్థలను ఏం చేయలేక వారి ఉద్యోగులను కిడ్నాప్ చేస్తున్నారని కూడా విమర్శించారు.