స్టాక్ మార్కెట్లలో రికార్డు స్థాయి ర్యాలీకి బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 887 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 234 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 4 శాతం వరకు నష్టపోయిన ఎల్ అండ్ టీ షేరు విలువ
గత కొన్ని సెషన్లుగా లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 887 పాయింట్లు నష్టపోయి 66,684కి పడిపోయింది. నిఫ్టీ 234 పాయింట్లు కోల్పోయి 19,745కి దిగజారింది. టెక్, ఐటీ, ఫైనాన్స్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి.
బీఎస్ఈ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (3.88%), ఎన్టీపీసీ (1.09%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.78%), కోటక్ బ్యాంక్ (0.70%), టాటా మోటార్స్ (0.68%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-8.18%), హిందుస్థాన్ యూనిలీవర్ (-3.65%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.33%), విప్రో (-3.07%), టీసీఎస్ (-2.68%).