దేశ జనాభాతో సమ నిష్పత్తిలో పెరుగుతున్న ముస్లిం జనాభా
- ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిన ఇండియా
- 2023 నాటికి 19.7 కోట్లకు చేరుకోనున్న ముస్లిం జనాభా
- మొత్తం జనాభాలో 14.2 శాతంగా ఉన్న ముస్లింలు
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిన సంగతి తెలిసిందే. 142.86 కోట్ల జనాభాతో చైనాను ఇండియా రెండో స్థానానికి నెట్టేసింది. ఇదే సమయంలో మన దేశంలో ముస్లింల జనాభా కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ విషయాన్ని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
టీఎంసీ ఎంపీ మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ 2011లో 17.2 కోట్లుగా వున్న ముస్లింల జనాభా 2023 నాటికి 19.7 కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. 2011లో మొత్తం జనాభాలో ముస్లింల జనాభా 14.2 శాతంగా ఉందని... 2023లో కూడా అదే నిష్పత్తిలో ముస్లిం జనాభా ఉంటుందని తెలిపారు. దేశ మొత్తం జనాభాతో సమ నిష్పత్తిలో ముస్లిం జనాభా పెరుగుతోందని చెప్పారు.