మోదీ బాధ నిజ‌మే అయితే బీరేన్ సింగ్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసి ఉండేవారు: మ‌ల్లికార్జున ఖ‌ర్గే

  • కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల‌పై మోదీవి త‌ప్పుడు ఆరోణ‌లు అన్న ఖర్గే 
  • 80 రోజులుగా మ‌ణిపూర్ మండిపోతున్నా ప్ర‌భుత్వం నోరు మెదపడం లేదని విమర్శ 
  • పార్ల‌మెంటులో ఆయ‌న ప్ర‌క‌ట‌న చేస్తార‌ని దేశం మొత్తం ఎదురుచూస్తోంద‌న్న కాంగ్రెస్ చీఫ్‌
మ‌ణిపూర్‌లో మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగించిన ఘ‌ట‌న‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ నిజంగానే తీవ్రంగా ప‌రిగ‌ణిస్తే తొలుత ఆయ‌న ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బీరేన్‌సింగ్‌ను డిస్మ‌స్ చేయాల్సింద‌ని కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం మాని ముందు మ‌ణిపూర్ సీఎంను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని కోరారు. 

మ‌ణిపూర్ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని నేడు పార్ల‌మెంటులో ప్ర‌క‌ట‌న చేస్తార‌ని దేశం ఎదురుచూస్తోంద‌న్నారు. 80 రోజులుగా మ‌ణిపూర్ మండిపోతున్నా ప్ర‌భుత్వం నోరు మెద‌ప‌లేద‌ని, పూర్తి నిస్స‌హాయంగా ఉండిపోయింద‌ని, ఎలాంటి ప‌శ్చాత్తాపం చెంద‌లేద‌ని మండిప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో నేడు పార్ల‌మెంటులో ప్ర‌ధాని మోదీ దీనిపై ప్ర‌కట‌న చేస్తార‌ని దేశం మొత్తం ఆశిస్తోంద‌ని ట్వీట్ చేశారు. మోదీ నిజంగానే మ‌ణిపూర్ ఘ‌ట‌న‌పై బాధ‌ప‌డి ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు మాని బీరేన్ సింగ్‌ను డిస్మ‌స్ చేసి ఉండేవార‌న్నారు.  


More Telugu News