నో అంటే నో అనేది మగాళ్లకీ వర్తిస్తుంది: విష్వక్సేన్

నో అంటే నో అనేది  మగాళ్లకీ వర్తిస్తుంది: విష్వక్సేన్
  • బేబి సినిమా గురించేనంటూ పలువురి ట్వీట్లు
  • ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా
  • హిట్ టాక్ సొంతం చేసుకున్న బేబి చిత్రం
నో అంటే నో అంటూ టాలీవుడ్ యువ హీరో విష్వక్సేన్ చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ‘నో అంటే నో అనేది పురుషులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి కూల్ గా ఉందాం. అరవడం మానేద్దాం. ఇక్కడ మనమంతా శాంతియుతంగా ఉన్నాం. కాబట్టి రిలాక్స్ అవ్వండి’ అంటూ విష్వక్సేన్ ఈ రోజు ఉదయం ట్వీట్ చేశాడు. అయితే, ఎవరిని, ఏ సందర్భాన్ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడనేని సస్పెన్స్ గా మారింది. 

‘బేబి’ సినిమాను ఉద్దేశిస్తూ అతను ఈ ట్వీట్ చేశాడని పలువురు ట్వీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా ముందుగా విష్వక్సేన్ ను అనుకున్నారట. కానీ, విష్వక్ ఒప్పుకోలేదని చెబుతున్నారు. కాగా, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన బేబి చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. భారీ కలెక్షన్లు కూడా రాబడుతోంది.


More Telugu News