ధోనీని అధిగమించిన రోహిత్ శర్మ

  • అంతర్జాతీయ క్రికెట్ లో 17,298 పరుగులు చేసిన రోహిత్ శర్మ
  • 17,092 పరుగులు చేసిన ధోనీని  అధిగమించిన వైనం
  • జాబితాలో తొలి స్థానంలో ఉన్న సచిన్ (34,357)
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 143 బంతుల్లో 80 పరుగులు చేసి మరోసారి సత్తా చాటాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ ధోనీని అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ 17,298 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ధోనీ (17,092)ని అధిగమించాడు. భారత్ తరపున రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (34,357 పరుగులు), విరాట్ కోహ్లీ (25,484), రాహుల్ ద్రావిడ్ (24,064), సౌరవ్ గంగూలీ (18,433) ఉన్నారు.  

రోహిత్ శర్మ 52 టెస్టుల్లో 3,620 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 212 పరుగులు రోహిత్ బెస్ట్ స్కోర్. వన్డేల విషయానికి వస్తే 243 మ్యాచ్ లలో 9,825 రన్స్ చేశాడు. వన్డేల్లో 30 సెంచరీలు, 48 అర్ధ శతకాలను సాధించాడు. వన్డేలో రోహిత్ అత్యధిక స్కోరు 212 పరుగులు. 148 టీ20ల్లో రోహిత్ 3,853 పరుగులు సాధించాడు. పొట్టి ఫార్మాట్ లో కూడా రోహిత్ 4 సెంచరీలు చేశాడు. 29 హాఫ్ సెంచరీలను సాధించాడు. టీ20ల్లో రోహిత్ హైయెస్ట్ స్కోరు 118 పరుగులు.


More Telugu News