అరగంటలో మూడు భూకంపాలు.. వణికిపోయిన జైపూర్

  • తెల్లవారుజామున 4.09 గంటల నుంచి 4.23 గంటల మధ్య భూకంపాలు
  • భూఉపరితలానికి 10 కి.మీ. లోతున భూకంప కేంద్రం
  • ఏం జరుగుతోందో తెలియక హడలిపోయిన ప్రజలు
రాజస్థాన్ రాజధాని జైపూర్ వరుస భూకంపాలతో వణికిపోయింది. ఈ తెల్లవారుజామున 4.09 నుంచి 4.23 గంటల మధ్య మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 3.1 నుంచి 4.22 మధ్య ఉంది. భూకంప కేంద్రం భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

మంచి నిద్రలో ఉన్నప్పుడు భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఏం జరుగుతోందో తెలియక హడలిపోయారు. కొందరు రోడ్లపైకి పరుగులు పెట్టారు. అయితే, ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. భూకంపంపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె స్పందిస్తూ జైపూర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించినట్టు తెలిపారు.  



More Telugu News