రోజులానే తుంపర్లు పడతాయనుకున్నాం.. తనకు ఫోన్ చేసిన వ్యక్తితో మంత్రి సబిత

  • వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
  • సెలవులు ప్రకటించిన సమయంపై అభ్యంతరాలు
  • మంత్రి సబితకు నేరుగా ఫోన్ చేసి ప్రశ్నించిన వరంగల్ వాసి
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం నిన్న స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అయితే, ప్రకటన చేసే సమయంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందరూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన తర్వాత సెలవంటూ చేసిన ప్రకటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోరున కురుస్తున్న వానలో చచ్చీచెడీ స్కూళ్లలో దిగబెట్టి వచ్చాక ప్రకటన చేయడాన్ని నిలదీస్తున్నారు. 

వరంగల్‌కు చెందిన ఎల్.శ్రీనివాస్ అనే వ్యక్తి అయితే ఇదే విషయమై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నేరుగా ఫోన్ చేశాడు. గురువారం ఉదయం పిల్లలు స్కూళ్లకు వెళ్లాక సెలవులు ప్రకటించడం వల్ల ఫలితమేంటని ప్రశ్నించాడు. మంత్రి స్పందిస్తూ.. తాము రోజులానే తుంపర్లు మాత్రమే పడతాయనుకున్నామని, కానీ వర్షం పెరిగి పెద్దది కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సెలవులు ప్రకటించానని మంత్రి పేర్కొన్నారు.


More Telugu News