రోహిత్-జైస్వాల్‌ మరోసారి 100 పరుగుల భాగస్వామ్యం

  • టీమిండియా- వెస్టిండీస్ రెండో టెస్టు నేడు ప్రారంభం
  • లంచ్ విరామానికి భారత్ పరుగులు 121/0
  • మూడుసార్లు 100 పరుగుల భాగస్వామ్యంతో తొలి స్థానంలో సెహ్వాగ్-విజయ్ 
  • ఇతరులతో కలిసి మూడుసార్లు సునీల్ గవాస్కర్ 100 పరుగుల భాగస్వామ్యం
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా లంచ్ సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. తొలి సెషన్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ (102 బంతుల్లో 63 పరుగులు), జైస్వాల్ (56 బంతుల్లో 52 పరుగులు) అదరగొట్టారు. 

అరంగేట్ర టెస్ట్‌లోనే సెంచరీ బాదిన జైస్వాల్ ఈ టెస్ట్‌లోను రోహిత్ తో కలిసి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. జైస్వాల్ ఎనిమిది బౌండరీలు, ఒక సిక్స్ కొట్టాడు. రోహిత్ శర్మ ఆరు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అత్యధిక 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంలో రెండో స్థానంలో నిలిచారు. రోహిత్, జైశ్వాల్ తొలి టెస్ట్ లోను వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అంతకుముందు సెహ్వాగ్ - మురళి విజయ్ 2008-09లో మూడుసార్లు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మొదటిస్థానంలో ఉన్నారు. 

ఆ తర్వాత సునీల్ గవాస్కర్ - ఫరూఖ్ ఇంజనీర్ 1973-74లో, గవాస్కర్ - అన్షుమన్ గైక్వాడ్ 1976లో, సునీల్ గవాస్కర్ - అరుణ్ లాల్ 1982లో, ఎస్ రమేశ్ - దేవంగ్ గాంధీ 1999లో రెండుసార్లు చొప్పున 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పుడు రోహిత్, యశస్వి వీరితో సమానంగా నిలిచారు.


More Telugu News