కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు త్వరలోనే మార్గదర్శకాలు: మంత్రి బొత్స

  • జోనల్ వ్యవస్థలు, ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
  • ఆగస్టు 7న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జీవో ఇస్తామన్న బొత్స 
  • జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉందని వివరణ
ఏపీలో జిల్లాల విభజన నేపథ్యంలో కొత్తగా జోనల్ వ్యవస్థల ఏర్పాటు, ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశం వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో పంచుకున్నారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉందని, త్వరలోనే విధివిధానాలు ఖరారు అవుతాయని వెల్లడించారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై ఉద్యోగ సంఘాలను తప్పకుండా సంప్రదిస్తామని తెలిపారు. 

ఇక, త్వరలోనే రాష్ట్రంలో కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి బొత్స పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. ఆగస్టు 7న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు.


More Telugu News