దుబాయ్ చట్టాలు చాలా కఠినం... అందుకు ఈ ఘటనే ఉదాహరణ!
- స్నేహితురాలితో కలిసి కారులో వెళుతున్న టిక్ టాక్ స్టార్ టియెర్రా
- రోడ్డు ప్రమాదానికి గురైన అద్దె కారు
- టియెర్రా స్నేహితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
- క్రెడిట్ కార్డులు, ఐడీ కార్డు కోసం కార్ రెంటల్ ఏజెన్సీ వద్దకు వెళ్లిన టియెర్రా
- ఓ వ్యక్తి కోపగించుకున్న వైనం... బిగ్గరగా కేకలు వేసిన టియెర్రా
- బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా అరిచిందంటూ అరెస్ట్
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలు ఉండే దేశాలుగా అరబ్ దేశాలకు గుర్తింపు ఉంది. చేతులు, కాళ్లు నరికి వేయడాలు, శిరచ్ఛేదాలు అక్కడ సాధారణమైన విషయం. తీవ్ర నేరాలకు పాల్పడితే మరణశిక్ష దాదాపు ఖాయం. అంతేకాదు, చిన్న తప్పులను కూడా అరబ్ దేశాల్లో శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.
అందుకే ఇతర దేశాల నుంచి దుబాయ్ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు అక్కడి చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. అందుకు ఈ ఉదంతమే నిదర్శనం. టియెర్రా యంగ్ అలెన్ అనే అమెరికా మహిళను దుబాయ్ లో అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశంలో పెద్దగా కేకలు వేయడమే ఆమె చేసిన నేరం. రెండు నెలలుగా ఆమె జైల్లోనే ఉంది.
టియెర్రా యంగ్ అలెన్... హూస్టన్ నగరంలో ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తోంది. ఆమె సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్, టిక్ టాక్ స్టార్ కూడా. అయితే, దుబాయ్ లో ఓ ఫ్రెండ్ తో కలిసి కారులో వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో టియెర్రా యంగ్ అలెన్, ఆమె స్నేహితురాలు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. కారు మాత్రం బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో, టియెర్రా యంగ్ స్నేహితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు వారం రోజుల కస్టడీ తర్వాత విడిచిపెట్టారు.
అయితే, టియెర్రా యంగ్ క్రెడిట్ కార్డులు, ఐడీ కార్డు కార్ రెంటల్ ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. వాటిని తిరిగి తీసుకునేందుకు ఆమె కార్ రెంటల్ ఏజెన్సీ వద్దకు వెళ్లింది. అక్కడి సిబ్బందిలో ఓ వ్యక్తి కోపంతో చిందులు తొక్కాడు. కార్డులు తిరిగి అప్పగించే విషయంలో మాటా మాటా పెరిగింది. దాంతో టియెర్రా కూడా అదే స్థాయిలో బిగ్గరగా అరుస్తూ బదులిచ్చింది.
దుబాయ్ లో బహిరంగ ప్రదేశాల్లో పెద్ద గొంతుకతో అరవడం నేరం. ముఖ్యంగా, మహిళలు ఇలా కేకలు వేయడాన్ని ఏమాత్రం ఒప్పుకోరు. ఈ నేరం కింద టియెర్రా యంగ్ అలెన్ ను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దీని పట్ల టియెర్రా తల్లి టీనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎదుటి వ్యక్తి తప్పు పట్ల గట్టిగా మాట్లాడడం కూడా నేరమేనా అని ప్రశ్నించింది.
కాగా, ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు టియెర్రాపై ప్రయాణ నిషేధం విధించారు. దాంతో ఆమె ఇప్పట్లో దుబాయ్ దాటి వచ్చే అవకాశాలు తక్కువే.