'క్లీంకార' ఆగమనాన్ని అందమైన వీడియోతో పరిచయం చేసిన రామ్ చరణ్, ఉపాసన
- జూన్ 20న తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన
- క్లీంకారకు జన్మనిచ్చిన ఉపాసన
- వీడియో రూపొందించిన జోసెఫ్ ప్రతనిక్
- వివిధ ముఖ్య ఘట్టాలతో అందరినీ అలరించేలా అద్భుతమైన వీడియో
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల జీవితంలో జూన్ 20 ఎంతో కీలకం. ఎందుకంటే ఆరోజున క్లీంకార పుట్టుకతో వారు తల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. దీనిపై మెగాభిమానులు, కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు.
కాగా గురువారం (జులై 20) రోజున వీరు క్లీంకార ఆగమనానికి సంబంధించి హృదయానికి హత్తుకునే అందమైన వీడియోను విడుదల చేశారు. నేడు గురువారంతో పాప పుట్టి నెల రోజులు అవుతుంది. గురువారం రోజునే ఉపాసన పుట్టినరోజు కావటం విశేషం.
క్లీంకార వన్ మంత్ బర్త్ యానివర్సరీ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ జోసెఫ్ ప్రతనిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు. ఈ వీడియోలో లెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాసన తల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని కూడా ఉన్నారు.
రామ్ చరణ్ ల పెళ్లి, ఇంకా పిల్లలు పుట్టలేదని సాగిన ప్రచారం, రామ్ చరణ్ ఆవేదన, ఉపాసన గర్భవతి కావడం, ఆమెకు అపోలో ఆసుపత్రిలో ప్రసవం, మెగా ఇంట సంబరాలు, పాపకు బారసాల, నామకరణం... ఇలా వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
క్లీంకార ఆగమనం వేళ అందరిలోనూ ఎగ్జయిట్‌మెంట్, ఆనందం ఉట్టిపడడాన్ని ఈ వీడియోలో మనం గమనించవచ్చు. క్లీంకార పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ పండుగ చేసుకున్నారు. వాటన్నింటినీ వీడియోలో అందంగా చూపించారు.
ఈ భావోద్వేగం గురించి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ "క్లీంకార పుట్టే సమయంలో మా అందరిలోనూ తెలియని టెన్షన్. అంతా సరిగ్గా జరగాలని మేం అందరూ ప్రార్థిస్తున్నాం. అందుకు తగినట్టే అన్నీ అనుకూలంగా మారి సరైన సమయం కుదరటంతో పాప ఈ లోకంలోకి అడుగు పెట్టిందని భావిస్తున్నాను. పాప పుట్టిన ఆ క్షణం మనసుకి ఆహ్లాదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్టటానికి పట్టిన 9 నెలల సమయం, అప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా తలుచుకుని హ్యాపీగా ఫీలయ్యాం" అన్నారు.
క్లీంకార రాకకు దారి తీసిన ఆ మరపురాని క్షణాలతో పాటు, పాపకు ఆ పేరు పెట్టటానికి కారణమైన అసలు కథను కూడా వీడియోలో మనం గమనించవచ్చు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచు జాతి నుంచి స్ఫూర్తిని పొందారు. సదరు చెంచు జాతి ద్రావిడ సంస్కృతిలో భాగం. వారి సంస్కృతిలోని గొప్పతనం, విలువలే పాపకు ఆ పేరు పెట్టటానికి కారణమయ్యాయి.
ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల మాట్లాడుతూ "మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాలని నేను కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులను ఇవ్వకండి. అలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలని నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇవెంతో ముఖ్యమైనవి. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి. మనం అందరితో కలిసి సంతోషంగా ఉన్న సమయానికి విలువ ఇవ్వాలని నేను భావిస్తాను" అన్నారు.
వారి కుటుంబాలకు సంబంధించిన ప్రత్యేకమైన వీడియోను ప్రజలకు చూపించటం ద్వారా రామ్ చరణ్, ఉపాసనలను నెటిజన్స్ అభినందిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకులు, స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలపై చరణ్, ఉపాసన కృతజ్ఞతలు తెలియజేశారు.