గుడివాడ అమర్నాథ్ గారూ... విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు: విష్ణువర్ధన్ రెడ్డి
- చంద్రబాబు అప్పులపై ప్రశ్నించారా అంటూ పురందేశ్వరిపై అమర్నాథ్ విమర్శలు
- మీ మరిది చేసిన అప్పులకు లెక్క జమానా ఉన్నాయా అంటూ వ్యాఖ్యలు
- ఏపీ ప్రభుత్వ అక్రమ అప్పులను పురందేశ్వరి బయటపెట్టారన్న విష్ణువర్ధన్ రెడ్డి
నాడు టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబును ప్రశ్నించారా? మీ మరిది చేసిన అప్పులకు లెక్క జమానా ఉన్నాయా? అంటూ ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శనాస్త్రాలు సంధించారు. దీనిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. గుడివాడ అమర్నాథ్ గారూ... విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు అని హితవు పలికారు.
"ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.2,65,365 కోట్ల అప్పులు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ జులై వరకు నాలుగేళ్ల కాల వ్యవధిలో రూ.7,14,631 కోట్ల అప్పులు తెచ్చారు. ఇది వాస్తవమా? కాదా? ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చాలా వివరంగా ఏపీ ప్రభుత్వ అక్రమ అప్పుల గురించి వివరాలు బయటపెట్టారు. ఆమె వెల్లడించిన వివరాలు తప్పు అనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలు బయటపెట్టాలి. బీజేపీ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేదంటే, ఆ ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్టేనా?" అని విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.