మణిపూర్ ఘటనపై కేటీఆర్ ఫైర్.. మరీ ఇంత అనాగరికమా? అంటూ ట్వీట్
- జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్
- ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు
- దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శలు
- అనాగరికత సాధారణ స్థాయికి చేరిందన్న కేటీఆర్
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇంకా అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేకుంటున్నాయి. వాటికి ఇంకా అడ్డుకట్ట పడకముందే రాష్ట్రంలో జరిగిన మరో ఘటన దేశంలో సంచలనం రేపింది. ఇద్దరు మహిళలను నగ్నంగా నడి వీధిలో ఊరేగిస్తూ తీసుకెళ్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా, ఈ వీడియోను తొలగించాలంటూ కేంద్రం ఆదేశించింది.
ఈ వీడియోపై తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మరీ ఇంత అనాగరికమా? అంటూ ట్వీట్ చేశారు. దేశంలో అనాగరికత సాధారణ స్థాయికి ఎలా మారిపోయిందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని భయానక హింసాకాండ, అదుపులో లేని శాంతిభద్రతలను కేంద్రం మౌనంగా చూస్తోందని మండిపడ్డారు. మణిపూర్ లో ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నా కేంద్రం పెద్దలు స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.