ముంబైలో ఇక వీధి కుక్కలకూ ఐడీ కార్డులు..!

  • ముంబైలోని పాఫ్రెండ్ స్వచ్ఛంధ సంస్థ కొత్త కార్యక్రమం
  • ఐడీ కార్డుతో వీధి కుక్కలతో వచ్చే సమస్యలు తొలగుతాయని వెల్లడి
  • కుక్క వయసు, ఎన్ని పిల్లలు వివరాలతో కార్డు జారీ 
వీధి కుక్కలకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధార్ తరహా ఐడీ కార్డులు జారీ చేస్తోందో స్వచ్ఛంద సంస్థ. మొంబైలో సుమారు 20 వీధి కుక్కలకు వీటిని ఇచ్చింది. కుక్క వయసు, పిల్లల సంఖ్య, అది ఏ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తుందీ అనే వివరాలన్నీ ఈ కార్డులో ఉంటాయి. కుక్క మెడకు ఉన్న ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయని pawfriend (పాఫ్రెండ్) సంస్థ చెప్పుకొచ్చింది. 

మనుషుల్లాగే వీది కుక్కలకూ ఓ ఐడీ  కార్డు ఉండాలని ముంబైకి చెందిన ఇంజినీర్ అక్షయ్ రిడ్లాన్ భావించారు. తన ఆలోచనను pawfriend సంస్థతో పంచుకున్నారు. సంస్థ నిర్వాహకులకూ ఈ ఆలోచన నచ్చడంతో అందరూ కలిసి కార్యరంగంలోకి దిగారు. స్థానికులకు వీధి కుక్కల నుంచి ఎదురయ్యే సమస్యలను ఈ క్యూఆర్ కోడ్‌తో కొంత వరకూ పరిష్కరించవచ్చని తెలిపారు. తొలుత విమానాశ్రయం సమీపంలోని కొన్ని వీధి కుక్కలకు వీటిని జారీ చేశారు. ముంబైలోని వీధి కుక్కలన్నిటికీ ఈ కార్డులు ఇవ్వాలనేదే తమ సంకల్పమని చెప్పారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారూ ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందిస్తున్నారు. కుక్కలకు క్యూఆర్ కోడ్ ఇచ్చేముందు వాటికి వ్యాక్సినేషన్ చేస్తోంది


More Telugu News