పని చేసేందుకు ఆసక్తిలేని ఈ వాలంటీర్లు మాకొద్దు.. వీరిని తక్షణమే తొలగించండి: మంత్రి ధర్మాన ఆదేశం
- శ్రీకాకుళంలో జగనన్న సురక్ష కార్యక్రమం
- కార్యక్రమానికి హాజరుకాని పలువురు వాలంటీర్లు
- వాలంటీర్లు హాజరుకాకపోవడం సరికాదన్న ధర్మాన
ఏపీ ప్రభుత్వం జగనన్న సురక్ష పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళంలోని గుడి వీధి సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమానికి కొందరు వాలంటీర్లు గైర్హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి తనతో పాటు, పార్టీ శ్రేణులు, అధికారులు హాజరైతే, వాలంటీర్లు రాకపోవడం ఏమిటని ధర్మాన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి వాలంటీర్లు హాజరుకాకపోవడం సరికాదని అన్నారు. పని చేసేందుకు ఆసక్తిలేని వాలంటీర్లు తమకు వద్దని, వారు స్వచ్ఛందంగా తొలగిపోవచ్చని చెప్పారు. సమావేశానికి హాజరుకాని వాలంటీర్లను తక్షణమే తొలగించాలని కార్యక్రమ ఇన్ఛార్జీ, నగరపాలక సంస్థ ప్రజారోగ్యాధికారిని ఆదేశించారు.